నూతన నియామకం
జూలై 4 ,2024న ఇటలీలోని నెమీలో జరిగిన సొసైటీ ఆఫ్ ది డివైన్ వర్డ్ (SVD) వారి 19వ జనరల్ చాప్టర్‌లో గురుశ్రీ అన్సెల్మో రికార్డో రిబీరో గారిని ఆ సభ సుపీరియర్ జనరల్ గా ఎన్నుకున్నారు
సుపీరియర్ జనరల్‌గా తన నియమించడం ముందు, రెబిరో గారు బ్రెజిల్ నార్త్ ప్రావిన్స్‌లో ప్రొవిన్షియల్ కౌన్సిలర్‌గా పనిచేశారు
బ్రెజిల్‌లోని జుయిజ్ డి ఫోరా రెసిడెన్స్ రెక్టర్ గాను, బ్రెజిల్ నార్త్ ప్రావిన్స్‌కు ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా, ఉత్తర మరియు దక్షిణ అమెరికాలోని PANAM జోన్ ( 24 దేశాల) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం రోమ్‌లో జనరల్ కౌన్సిలర్‌గా కూడా ఉన్నారు.
రిబీరో 1998లో SVD సభలో చేరారు. తను 1999లో తన మొదటి మాటపట్టును మరియు 2004లో తన శాశ్వత మాటపట్టు చేసారు. 2005లో గురువుగా అభిషేకింపబడ్డారు.
హాలండ్ స్టెయిల్ లో పునీత ఆర్నాల్డ్ జాన్సెన్ గారు 1875లో SVD సభను స్థాపించారు. ఇది డివైన్ వర్డ్ మిషనరీస్ అని పిలువబడుతుంది
ఈ సభ ఐదు ఖండాలలో దాదాపు 6,000 మంది సభ్యులను కలిగి ఉంది, విద్య, బైబిల్ అపోస్టోలేట్, కమ్యూనికేషన్, న్యాయం, శాంతి మరియు వివిధ మంత్రిత్వ శాఖలలో చురుకుగా నిమగ్నమై ఉంది.
రిబీరో గారు 2024 నుండి 2030 వరకు SVD సుపీరియర్ జనరల్‌గా వ్యవహరించనున్నారు.