నూతన నియామకం
ఫ్రాన్సిస్ పాపు గారు మే 25, 2024న ఇండోనేషియాలోని ఎండే అగ్రపీఠానికి నూతన అగ్రపీఠాధిపతులుగా గురుశ్రీ పౌలస్ బుడి క్లెడెన్, SVD గారిని నియమించారు
ప్రస్తుతం వీరు సొసైటీ ఆఫ్ ది డివైన్ వర్డ్ యొక్క సుపీరియర్ జనరల్ గా తన సేవలనందిస్తున్నారు.
ఈ నియామకాన్ని SVD వైస్ సుపీరియర్ జనరల్, గురుశ్రీ జోస్ అన్ట్యూన్స్ డి-సిల్వా గారు ఒక ప్రకటనలో తెలిపారు.
క్లెడెన్ గారు నవంబర్ 16, 1965న ఇండోనేషియాలోని ఫ్లోర్స్‌లోని లారంటుకా మేత్రాసనం వైబాలున్‌లో జన్మించారు.
ఆగష్టు 1, 1987న లెడలెరోలో తన మొదటి మాటపట్టు చేసారు.
సెప్టెంబర్ 29, 1992న ఆస్ట్రియాలోని సెయింట్ గాబ్రియేల్‌లో మాటపట్టు చేసారు.
మే 15, 1993న గురువుగా అభిషేకింపబడ్డారు.
జర్మనీ,ఫ్రీబర్గ్ ఆల్బర్ట్-లుడ్విగ్స్-యూనివర్సిటీ నుండి సిస్టమాటిక్ థియాలజీలో డాక్టరేట్ పొందారు.
లెడలెరో,సెమినరీ సెయింట్ పాల్‌లో లెక్చరర్ (2001–2012), లెడలెరో-సెమినరీ సెయింట్ పాల్‌లో ఫార్మేటర్(2001–2005), ఇదే ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేటర్ (2005 - 2007), వైస్ సుపీరియర్ ప్రొవిన్షియల్ ఆఫ్ IDE (2007–2008), జనరల్ కౌన్సిలర్ (2012-2018) మరియు సుపీరియర్ జనరల్ (2018–2024).
1913లో, అపోస్టోలిక్ ప్రిఫెక్చర్ ఎండే స్థాపించింది. 1961లో ఇది అగ్రపీఠంగా మారింది.
5,084 చదరపు కిలోమీటర్లు,602,000 జనాభాలో 486,000 కథోలికులు కలిగి ఉంది.
2023 నాటికి 72 విచారణలు, 261 మంది గురువులు (185 మేత్రాసన, 76 ఇతర సభ గురువులు), 9 మంది డీకన్‌లు, 230 మంది మహిళా మత సంస్థల సభ్యులు, 203 మంది పురుషుల మత సంస్థల సభ్యులు మరియు 74 మంది గురు విద్యార్థులు ఉన్నారు.