నూతన నియామకం

జనవరి 30, 2024  బెంగుళూరులో కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషోప్స్ ఆఫ్ ఇండియా (CCBI)  ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనిటా డుండుంగ్‌ గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్‌కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు.

జార్ఖండ్‌, రాంచీ ప్రావిన్స్‌లోని ఉర్సులిన్ సిస్టర్స్‌ కాంగ్రెగేషన్ అఫ్ టిల్డోంక్  చెందినవారు.

1986 ఆగస్టు 19న ఒడిషాలోని జైదేగా నవటోలిలో జన్మించారు.

సిస్టర్ గారు ఒడిషాలోని జున్‌మూర్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు.

తన జీవితాన్ని టిల్డోంక్, రాంచీ ప్రావిన్స్‌లోని ఉర్సులిన్ సిస్టర్స్‌కు అంకితం చేసింది, డిసెంబర్ 8, 2007న  రాంచీ ప్రావిన్స్‌లోని ఉర్సులిన్త సిస్టర్ గా మొదటి మాట పట్టుని మరియు సెప్టెంబర్ 9, 2015న చివరి మాట పట్టుని స్వీకరించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సైన్స్, భువనేశ్వర్ నుండి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

2013 నుండి 2016 వరకు బీహార్‌లోని పూర్నియాలో వైకల్యాలున్న పిల్లలకు మరియు 2016 నుండి 2018 వరకు ఢిల్లీలో కార్మికుల ఇన్‌ఛార్జ్‌గా తన సేవను అందించగా  

2018 నుండి జార్ఖండ్‌లోని ఖుంటిలో ఆశా కిరణ్ షెల్టర్ హోమ్ డైరెక్టర్‌గా పనిచేశారు, సామాజిక సంక్షేమం మరియు బలహీన వర్గాల శ్రేయస్సు పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు.

Tags