నూతన నియామకం
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబర్ 21, 2024న మనీలాకు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగునా ప్రావిన్స్, సాన్ పాబ్లో మేత్రాసనానికి నూతన పీఠాధిపతిగా మహా పూజ్య మార్సెలినో ఆంటోనియో మరాలిట్ గారిని నియమించారు.
ఆరోగ్య సమస్యల కారణంగా మహా పూజ్య బోనవెంచర్ ఫామాడికో రాజీనామా అనంతరం సాన్ పాబ్లో మేత్రాసనానికి సెప్టెంబర్ 2023 నుండి పీఠాధిపతులు లేకుండా ఉంది.
పాసిగ్‌కు చెందిన మహా పూజ్య మైలో హుబెర్ట్ వెర్గారా గారు మేత్రాసన పాలనాధికారిగా పనిచేశారు.
మరాలిట్ గారు లిపా, బటాంగాస్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ మేజర్ సెమినరీలో తన తాత్విక అధ్యయనాన్ని పూర్తి చేసారు మరియు స్పెయిన్‌లోని యూనివర్సిడాడ్ డి నవర్రా నుండి వేదాంతశాస్త్రంలో లైసెన్షియేట్ పొందారు.
1995లో లిపా అగ్రపీఠానికి గురువుగా అభిషేకింపబడ్డారు.
రోమ్‌లోని పొంటిఫికల్ యూనివర్శిటీ ఆఫ్ హోలీ క్రాస్‌లో చర్చి హిస్టరీ లో లైసెన్షియేట్ పొందారు.
2014లో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బోయాక్ మేత్రాసదనానికి పీఠాధిపతిగా నియమించారు, ఇది మనీలాకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిండుక్ ద్వీప ప్రావిన్స్‌కు చెందింది.
మరాలిట్ గారు ఫిలిప్పీన్స్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP)ఎపిస్కోపల్ సోషల్ కమ్యూనికేషన్స్ కమీషన్ అధ్యక్షులుగా కూడా తన సేవను అందిస్తున్నారు.