దైవార్చన సమన్వయకర్తలకు ప్రత్యేక నిర్వహణ కార్యక్రమం

మద్రాస్-మైలాపూర్ అగ్రపీఠం దైవార్చన విభాగం వారు పన్నెండు వికారియేట్‌లలో మూడింటిలో ప్రార్ధనా సమన్వయకర్తల కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గురుశ్రీ డాక్టర్ ఆరోకియ జోసఫ్ జయకుమార్ గారి నేతృత్వంలో రాబోయే జూబ్లీ 2025 కొరకు విస్తృత సన్నాహాలు చేశారు.

మద్రాస్-మైలాపూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జార్జ్ అంతోని స్వామి మార్గదర్శకత్వంలో, ఈ కార్యక్రమం రెండవ వాటికన్ కౌన్సిల్ బోధనలపై దృష్టి సారించడం, ప్రత్యేకించి "సాక్రోసాంక్టమ్ కన్సిలియం" పత్రంలోని పవిత్ర దైవార్చన ద్వారా సామాన్య నాయకుల ప్రార్ధనా జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి నుండి విశేషమైన సానుకూల స్పందన లభించింది. వీరు పంచుకున్న జ్ఞానం, శిక్షణ యొక్క ఆచరణాత్మక స్వభావాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం అగ్రపీఠ BCC కార్యదర్శి గురుశ్రీ ఆరోకియా రాజ్ గారి సమన్వయం నిర్వహించబడింది.

అగ్రపీఠంలో దైవార్చన విభాగం తన పనిని కొనసాగిస్తున్నందున, సమన్వయకర్తలకు అవసరమైన జ్ఞానంతో సన్నద్ధం చేయడమే కాకుండా, ముఖ్యమైన జూబ్లీ వేడుకలకు సన్నాహకంగా స్థానిక శ్రీసభ యొక్క ఆధ్యాత్మిక పునాదిని బలపరుస్తుంది అని కే అరుళ్ జేసు  గారు అన్నారు.