థాయ్‌లాండ్ ఘోర బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
అక్టోబరు 1న బ్యాంకాక్ సమీపంలో పాఠశాల బస్సు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది విద్యార్థులు మరియు ముగ్గురు ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు సంతాపాన్ని తెలియచేసారు.
కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్ ద్వారా పంపిన సందేశంలో, పొప్ గారు ఈ ప్రమాదంపై "విచారం" వ్యక్తం చేశారు.
"ఈ విషాదం వల్ల దుఃఖిస్తున్న కుటుంబాల" కొరకు తాను ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు.
ఉత్తర బ్యాంకాక్ సైన్స్ మ్యూజియంకు క్షేత్ర పర్యటన సందర్భంగా ఈ విషాద సంఘటన జరిగింది.
ఉథాయ్ థానిలోని వాట్ ఖావో ఫ్రయా సంజ్ఞకరం పాఠశాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లో ప్రయాణిస్తుండగా, 38 మంది పిల్లలు మరియు ఆరుగురు ఉపాధ్యాయులతో ఉన్న వారి వాహనం థాయ్ రాజధాని వెలుపల ఉన్న హైవేపై మంటల్లో చిక్కుకుంది.
బస్సు టైరు ఊడిపోవడంతో అడ్డంకిపైకి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రయాణికుల్లో సగం మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, కొందరు తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్నారు.
బాధితులకు అంత్యక్రియలు అక్టోబర్ 3న ప్రారంభమయ్యాయి.
బస్సు డ్రైవర్ నిర్లక్యంతోనే ఈ ప్రమాదానికి దారితీసినట్లు అనుమానంతో అరెస్టు చేయబడ్డారు, అయితే అధికారులు బస్సు యొక్క కంప్రెస్డ్ గ్యాస్ ట్యాంక్‌లు మంటలు వేగంగా వ్యాపించడానికి దోహదపడ్డాయా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.