జాతీయ ఎన్నికల కారణంగా ఇండోనేషియా బిషప్ "విభూది బుధవారాన్ని" వాయిదా వేశారు

జాతీయ ఎన్నికల కారణంగా ఇండోనేషియా బిషప్ "విభూది బుధవారాన్ని" వాయిదా వేశారు

 

రుటెంగ్, ఇండోనేషియా - ఇండోనేషియా రుటెంగ్ పీఠాధిపతులు , మహా పూజ్య సిప్రియానస్ హోర్మాట్ గారు విభూది బుధవారాన్ని అదే రోజు జరిగే జాతీయ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 14, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 గురువారానికి వాయిదా వేశారు.

విభూది బుధవారం వేడుకను గురువారం (ఫిబ్రవరి 15) ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించాలని, ఫిబ్రవరి 19, 2024 ఆదివారం కూడా చేయవచ్చు" అని పీఠాధిపతులు (బిషప్) హార్మాట్ జనవరి 16, 2024 నాటి తన పాస్టోరల్ లెటర్‌లో పేర్కొన్నారు.

 

మహా పూజ్య హోర్మాట్ గారు ఎన్నికల సమయంలో ప్రజలు "చురుకుగా, సముచితంగా మరియు మనస్సాక్షితో ఓటు వేయాలని " కోరారు, ప్రజల సంక్షేమానికి కట్టుబడి, పేదవారికి సహాయం చేస్తున్నటువంటి నాయకులను ఎన్నుకోవడంలో స్వేచ్ఛగా మరియు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

అంతేకాకుండా, పేదరికం (ఆర్థిక అస్థిరత), అవినీతి, గ్లోబల్ వార్మింగ్/వాతావరణ మార్పు మరియు ఉత్పాదక జనాభా పెరుగుదల అనే నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే దేశంగా అసౌకర్య పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన మార్గదర్శకాలను అందించారు.

వీటిలో ముఖ్యం గా వారి తోటి పౌరుల పట్ల, ముఖ్యంగా బలహీనులు మరియు పేదవారి పట్ల శ్రద్ధ మరియు కరుణ చూపే నాయకులను ఎన్నుకోవడం ప్రాథమికమైనది.

 

ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మానవ వనరులను బలోపేతం చేయడం అవసరం ఎంతో ఉంది అని, ఈ సవాళ్లతో, దేశానికి అర్హత కలిగిన నాయకత్వ సామర్థ్యం అవసరం అని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను పీఠాధిపతులు హోర్మాట్ గారు కోరారు.

చివరిగా అయన తన లేఖలో "ఇండోనేషియా తెగలు, ఆచారాలు, భాషలు, సంస్కృతులు మరియు మతాల వైవిధ్యంతో కూడిన ప్రత్యేకమైన దేశం అని, ప్రజలను, ముఖ్యంగా యువతను, మొదటి సారి ఓటర్లు అందరు స్పష్టమైన హృదయంతో ఓటు వేయమని హోర్మాట్ గారు ఆహ్వానించారు.

"చరిత్రను మరచిపోవద్దని, ఇచ్చిన వాగ్దానాలను మరచి మోసం చేసే రాజకీయ నాయకులను నమ్మవద్దని, ప్రజలకు "మంచి చేసే సమర్థుడైన" నాయకుడిని ఎన్నుకోండి అని బిషప్ సలహా ఇచ్చారు.

ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బిషప్ ఎన్నికల్లో పాల్గొనే నాయకులందరినీ ప్రేమగా పట్టుకుని ఆలింగనం చేసుకోవాలని, దేశంలోని అన్ని రాజకీయ నేతల జీవితాల్లో ప్రేమ ఎప్పుడూ కలిగి ఉండాలని పీఠాధిపతులు , మహా పూజ్య సిప్రియానస్ హోర్మాట్ గారు ప్రార్థించారు.

 

Article and Design By

KRANTHI

RVA Telugu Online Producer