ఘనంగా పునీత తోమాగారి దేవాలయ 29వ వార్షికోత్సవం
నల్గొండ మేత్రాసనం ,యాతవాకిళ్ళ గ్రామం అంజలి పురం విచారణలో ఘనంగా పునీత తోమా(St.Thomas) గారి దేవాలయ 29వ వార్షికోత్సవం జరిగింది .విచారణ గురువులు గురుశ్రీ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
పండుగ రోజు అనగా 8 జూన్ 2024 శనివారం నాడు ఉదయం 10 గంటలకు పండుగ దివ్యబలి పూజను సమర్పించారు. ఈ దివ్యబలిపూజలో చౌటపల్లి విచారణ గురువులు గురుశ్రీ అరుణ్ గారు పాల్గొని దైవసందేశాని అందించారు.
దివ్యబలి పూజ తదనంతరం మేరిమాత యూత్ ఆధ్వర్యంలో విచారణలో విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ బహుమతులను ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు గౌరవ శ్రీ,, SK మస్తాన్ గారు, మట్టపల్లి రవీందర్ గారి సహకారంతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేరిమాత యూత్ తో పాటు మరియాదళం సంఘ కాపరి YVసాగర్ సామ్రాజ్యం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే మఠం పల్లి శుభోధయం యువజన సంఘ వారు విద్యా కళాక్రీడాకారుల ను ప్రోత్సహిస్తూ అధ్యక్షులు జయ భరత్ రెడ్డి గారు క్రీడా సామాగ్రిని నెట్, వాలిబాల్ కిట్, ఆటవస్తువులు
యువతకు బహుకరించారు.
వర్షాకాలంలో దేవాలయ మరియు క్రీడల మైదానంలో వర్షపునీరు ఉండి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి శ్రీ కొలహలం కృష్ణం రాజు గారు, శ్రీ లక్ష్మి నర్సింహా రాజు గార్లు వెంటనే స్పందించి ఉదరంగా 7000 రూపాయల ఖర్చు తో రిపేర్ చేయించి దేవాలయం మీద అభిమానాన్ని చాటుకున్నారు.
విచారణ గురువులు నరేష్ గారు మాట్లాడుతూ పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మేరీ మాత యూత్ సభ్యులు ను అభినందించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer