ఘనంగా నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం

ఘనంగా నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, కింతలి గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ దేవాలయాన్ని  "అద్భుత బాలయేసు దేవాలయం" గా నామకరణం చేసారు.  

ఈ సుందర దేవాలయాన్ని  కీ.శే., పాము ఉర్బన్న గారి జ్ఞాపకార్ధం వారి శత జయంతి సందర్భంగా ఈ దేవాలయం వారి కుటుంబ సభ్యుల ఆర్ధిక సహాయంతో నిర్మించడం జరిగినది.

జూన్ 10,2024 తేదీ సోమవారం  ఉ॥10 గం. ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ దివ్య పూజబలిని ఇతర గురువులతో కలసి సమర్పించారు.  

అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు మరియు కీ.శే., పాము ఉర్బన్న గారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కీ.శే., పాము ఉర్బన్న గారి కుమారుడు  శ్రీ PM రాజు గారు మాట్లాడుతూ "మా కుటుంబ సభ్యులు అందరూ ప్రతినెలా వారి ఆదాయము నుండి 10% దేవునికి ఇవ్వవలసిన భాగం  డబ్బులుతో ఇలాంటి దేవాలయాలు గ్రామాల్లో నిర్మించుటకు ఉపయోగించుచున్నామనీ తెలుపుతూ ఇది వారి 12 వ ప్రాజెక్టు అని ఆనందం వ్యక్తం చేశారు. మరియు ఇది దేవుని కార్యము అని , ఈ అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును అని అన్నారు.

విచారణకర్తలు గురుశ్రీ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ విచారణ పెద్దలకు , ప్రజలకు  మరియు  కీ.శే., పాము ఉర్బన్న గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer