క్రైస్తవ మిషనరీలు మరియు వారి కార్యకలాపాల వివరాలను కోరుతున్న మధ్యప్రదేశ్ పోలీసులు

catholic missionary

క్రైస్తవ మిషనరీలు మరియు వారి కార్యకలాపాల వివరాలను కోరుతున్న మధ్యప్రదేశ్ పోలీసులు

 భారతదేశంలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  క్రైస్తవ మిషనరీలు , మరియు  వాటి పనుల గురించిన సమాచారం రహస్యంగా సేకరిస్తున  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని శ్రీసభ గురువులు  తీవ్రంగా ఖండించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన పీఠాధిపతులు మహా పూజ్య  గెరాల్డ్ అల్మేడా గారు  మాట్లాడుతూ, "మా కొన్ని సంస్థల్లో స్థానిక పోలీసుల నుండి నిజంగానే కొన్ని ప్రశ్నలతో లేఖలు అందాయి , కానీ మేము ఇంకా వాటికీ సమాధానం ఇవ్వలేదు అని అన్నారు.

“క్రైస్తవులను ఎందుకు వేరు చేసి అలాంటి వివరాలను సేకరిస్తారో నాకు తెలియదు. నేను దాని వెనుక కొన్ని నిగూఢమైన ఉద్దేశాలను చూస్తున్నాను" అని మహా పూజ్య  గెరాల్డ్ అల్మేడా గారు  ఫిబ్రవరి 7న UCA న్యూస్‌తో అన్నారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న మిషనరీలు, వారు నిర్వహిస్తున్న సంస్థలు, వారి నిధుల వనరుల వివరాలను కోరుతూ పోలీసులు ఈ ప్రశ్నావళిని రూపొందించి క్రైస్తవ సంస్థలనుండి వివరణ కోరుతున్నారు.
వ్యక్తిగత మిషనరీ లేదా సంస్థ పేరు మరియు చిరునామా, పని లక్ష్యాలు, బ్యాంక్ ఖాతా మరియు విదేశీ నిధుల మూలాలు వంటి వివరాలను పోలీసులు కోరుతున్నారు. ఎవరేనా  ప్రభుత్వేతర సంస్థను (NGO) నడుపుతున్నట్లయితే, వారు మిషనరీతో కలిసి పనిచేస్తున్న వారి పేర్లు మరియు ఫోన్ నంబర్‌లను కూడా పోలీసులు కోరుతున్నారు.

2021లో హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం ఆమోదించిన కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టం ప్రకారం నిషేధించబడిన మత మార్పిడి కార్యకలాపాలను క్రైస్తవులు పాటిస్తున్నారా  లేదా అని కూడా ప్రశ్నాపత్రం లో కోరింది.

"పోలీసులు అనధికారికంగా సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నందున ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు మేము న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటాము" అని మహా పూజ్య  గెరాల్డ్ అల్మేడా గారు చెప్పారు.

వారు కోరిన సమాచారం చాలావరకు "మేము చేస్తున్నటువంటి  పనులు మరియు సేవ కార్యక్రమాలు" ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో పెట్టబడి  ఉంది అని, ఎప్పుడో  రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వలకు కూడా దాఖలు చేయబడింది అని  మహా పూజ్య  గెరాల్డ్ అల్మేడా గారు  అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న క్రైస్తవులను ప్రభుత్వం వేధించాలని భావిస్తున్నట్లుంది’ అని పీఠాధిపతి అన్నారు.  

మొదటిగా జూలై 2023లో ఇలాంటి వివరాలను కోరుతూ లేఖలు పంపారు అని , అయితే ఇది  మీడియాకు లీక్ అయిన తర్వాత కొంతకాలం తాత్కలికంగా ఈ వివాదం సద్దుమణిగింది.
అప్పుడు ప్రశ్నపత్రంలో అప్పుడు 15 ప్రధాన ప్రశ్నలు ఉండగా, ఈసారి వాటి సంఖ్య 30కి చేరుకుంది.

 జబల్‌పూర్, ఝబువా మరియు గ్వాలియర్ ఈ మూడు మేత్రాసనాలలోని పీఠాధిపతులకు  "అనధికారికంగా" ఈ ప్రశ్నాపత్రం అందిందని చెప్పారు.
"ప్రశ్నపత్రం అనధికారికంగా మాకు అందజేయబడింది అని ఝబువా మేత్రాసన  పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గురుశ్రీ  రాకీ షా గారు అన్నారు .

శ్రీసభ  ఆధ్వర్యంలో నడిచే సంస్థలు ప్రభుత్వానికి సమాచారం అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అది సరైన మార్గాల ద్వారా రావాలని ఆయన అన్నారు.
"మేము చట్టవిరుద్ధ కార్యక్రమాలు ఏమి చేయడంలేదు అని , ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధం" అని గురుశ్రీ రాకీ షా గారు స్పష్టం చేశారు.

అయితే, ప్రశ్నాపత్రం రూపొందించిన తీరు,  వివరాలను  పోలీసులు సేకరిస్తున్న విధానం   అనుమానాలకు తావిస్తోందని గురుశ్రీ రాకీ షా గారు  అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని 72 మిలియన్ల జనాభాలో 0.29 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు, గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వచ్చింది.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer