కుట్టు మెషీన్లు అందచేసిన ఆంధ్రప్రదేశ్ సాంఘీక సేవా సంస్థ
జులై 2న ఆంధ్రప్రదేశ్ సాంఘీక సేవా సంస్థ కర్నూలు మేత్రాసనంలోని కుట్టు శిక్షణా కేంద్రానికి 10 కుట్టు మెషీన్లు అందచేశారు.
కర్నూలు మేత్రానులు మహా పూజ్య గోరంట్ల జ్వానేసు గారి దివ్య ఆశిషులతో ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భముగా APSSS ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ టి. పి. ప్రసాద్ గారు మాట్లాడుతూ "పేద మహిళలు, మధ్య తరగతి మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవడమే APSSS లక్ష్యం అని అన్నారు. ప్రతి ఒక్క మహిళా ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండి స్వతహాగా ఎదగడం అనేది చాలా ముఖ్యమని, అందుకు ప్రతి ఒక్క మహిళా కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకొని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో నిలబడాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా సౌత్ ఇండియన్ బ్యాంకు(సికింద్రాబాద్) డిప్యూటీ జనరల్ మానేజర్ శ్రీ వై శశిధర్ గారు విచ్చేయగా. క్లస్టర్ హెడ్ శ్రీ బి షాబాజ్, కర్నూలు బ్రాంచ్ మానేజర్ బి సుధీర్ కుమార్ గార్లు పాల్గొన్నారు.
కర్నూలు సాంఘీక సేవా సంస్థ డైరెక్టర్ గురుశ్రీ సనికే సుధాకర్ (భాస్కర్) గారు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘీక సేవా సంస్థ(APSSS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలు ప్రసంశానీయం. ఆంద్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ(APSSS) 48 ఏళ్ళుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తోంది.