ఇండోనేషియా కథోలికులు విశ్వాసం, ఐక్యత మరియు కరుణను కలిగి ఉండాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఇండోనేషియా కథోలికులు విశ్వాసం, ఐక్యత మరియు కరుణను కలిగి ఉండాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

సెప్టెంబరు 4న, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  జకార్తాలోని కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్‌లో మతాధికారులను మరియు మత పెద్దలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరు విశ్వాసం, సౌభ్రాతృత్వం మరియు కరుణ యొక్క సద్గుణాలను కలిగి ఉండాలని వారిని కోరారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు శ్రీసభలో ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఇండోనేషియా దాదాపు 17,000 మరియు అనేక తెగలు, జాతులు, భాషలు మరియు సంస్కృతులతో కూడి ఉంది.
శ్రీసభ బోధనలను బహాసా (ఇండోనేషియా భాష)లోకి అనువదించడం ద్వారా ఇండోనేషియా ప్రజలకు శ్రీసభను మరింత దగ్గర చేయవచ్చు అని అయన అన్నారు.

కనికరం అనే అంశంలో, బలహీనుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సందర్భముగా కోరారు. న్యాయమైన మరియు దయగల సమాజానికి అవసరమైన స్తంభాలుగా దాతృత్వం మరియు సంఘీభావం ఉండాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer