అపోస్తలిక జీవన సంస్థల విభాగానికి కార్యదర్శిగా ఎన్నికైన సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా

అపోస్తలిక జీవన సంస్థల విభాగానికి కార్యదర్శిగా ఎన్నికైన సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా

 పోప్ ఫ్రాన్సిస్ గారు, వాటికన్ లోని పొప్ గారి  పరిపాలన యంత్రాంగంలోని సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగానికి గాను,కన్సోలాటా మఠ సంస్థకు చెందిన సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా గారిని కార్యదర్శిగా ఎన్నుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.


2019లో ఇదే శాఖలో ఆమె సభ్యురాలుగా ఉంటూ, తన అమూల్యమైన సేవలందించారు. సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా గారు వేదాంత ఆధ్యాపకురాలిగా, కన్సోలాటా మఠ సంస్థకు జనరల్ కౌన్సిలర్ గా, సుపీరియర్ జనరల్గా తన అమూల్యమైన సేవలు శ్రీసభకు అందించారు.ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక ఎదుగుదలకై ఆమె ఎంతగానో శ్రమించారు. ఆమె సేవలను పరిగణలోనికి తీసుకొని పోప్ ఫ్రాన్సిస్ గారు  ఇంతటి ప్రతిష్టాత్మకమైన హోదాకు ఆమెను ఎన్నుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు శ్రీసభ సేవా పరిచర్యలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా గణనీయమైన పాత్రను పోషించాలని తలంచి, గతంలోను వారికి పలు కీలక పదవులు,నిర్ణయాధికార బాధ్యతలు కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా పోప్ ఫ్రాన్సిస్ గారు  సినడ్ సమావేశాలలో మహిళలకు సైతం ఓటు హక్కు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసినదే. మహిళలను శ్రీసభ సేవ పరిచర్యలలో భాగస్తులను చేస్తూ, పురుషులతో పాటు వారికి సైతం సమాన హోదాను కల్పిస్తున్నందుకుగాను, వారిని ప్రోత్సహిస్తున్నందుకుగాను సామాజిక మాధ్యమాల ద్వారా విశ్వాసులు పోప్ ఫ్రాన్సిస్ గారిని  ను ప్రశంసిస్తున్నారు.