జీవితంలో మరింత శ్రద్ధగా ఉండాలని ప్రార్థించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

జీవితంలో మరింత శ్రద్ధగా ఉండాలని ప్రార్థించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఆదివారం రోజు ఏంజెలస్‌ వద్ద ప్రార్థనలలో భాగంగా  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం మరియు మరింత శ్రద్ధగా మరియు దయతో ఉండాలని చెప్పారు, మనం రోజువారీ చింతల నుండి ఉపశమనాన్ని పొందాలని అన్నారు.

ప్రస్తుత రోజులలో కనికరం చూపడానికి మరియు ఇతరుల అవసరాలకు వెంటనే  ప్రతిస్పందించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది అని,   పనులను పూర్తి చేయడం గురించి ఆత్రుతగా ఉండకూడదు అని   ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.  

పని చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు  చాలా గంటలు దూరంగా ఉండటం వల్ల ఇది కూడా "సామాజిక అన్యాయం" అని అన్నారు.

ఈ సందర్భముగా మార్కు సువార్త  నుండి  తీసుకున్న సువార్త పఠనాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  వివరించారు. అపొస్తలులు తమ బోధ  నుండి తిరిగి వచ్చిన తర్వాత శిష్యులను సైతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా  ప్రభు యేసు క్రీస్తు వారు కోరారని గుర్తు చేసారు.  

ఒక వ్యక్తి యొక్క జీవితం వృత్తి పరమైన మరియు మతసంబంధమైన పనిలో నిమగ్నమై వాటిలో చిక్కుకొని  ఉండవచ్చు అని, "సోదర సోదరీమణులారా, చేస్తున్న నియంతృత్వం పట్ల జాగ్రత్తపడదాం! అని మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer