ప్రపంచ శరణార్థుల దినోత్సవం
ప్రపంచ శరణార్థుల దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
శరణార్థి అంటే హింస వల్ల ఏర్పడిన భయం కారణంగా తన ఇల్లు మరియు దేశం వదిలి పారిపోయిన వ్యక్తి. ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల ప్రభావాల నుండి తప్పించుకోవడానికి చాలా మంది శరణార్థులు ప్రవాసంలో ఉన్నారు.శరణార్థులందరినీ గౌరవించటానికి, అవగాహన పెంచడానికి మరియు మద్దతును కోరడానికి ఈ రోజును జ్ఞాపకం చేస్తారు.
ప్రజలు తమ స్వస్థలం నుండి పారిపోవడానికి అత్యంత సాధారణ కారణాలు యుద్ధం, హింస మరియు భీభత్సం కారణంగా వారు తమ ఇళ్లను వదిలి వేరే చోట ఆశ్రయం పొందవలసి ఉంటుంది.
తీవ్రమైన శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో సిరియా (6.6 మిలియన్ల శరణార్థులు), ఆఫ్ఘనిస్తాన్ (2.7 మిలియన్ల శరణార్థులు), దక్షిణ సూడాన్ (2.2 మిలియన్ల శరణార్థులు), మయన్మార్ (1.1 మిలియన్ల శరణార్థులు) మరియు సోమాలియా (0.9 మిలియన్ల శరణార్థులు) ఉన్నాయి.
శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అమానవీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్నింటిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్నా ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ ('యునైడెట్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ - యుఎన్హెచ్సిఆర్) పిలుపుమేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పౌర సంఘాలు ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.